అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సరికాదు.. స్పీకర్ తమ్మినేని కామెంట్స్..!

Monday, October 26th, 2020, 11:28:30 PM IST


ఏపీలో 139 బీసీ కులాలను కలిపి 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ఇటీవల వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్పోరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ల పేర్లను కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని చెప్పుకొస్తుండగా టీడీపీ నేతలు మాత్రం కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఏమీ లేదని విమర్శిస్తున్నారు.

అయితే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్పొరేషన్ పదవులు నాలుక గీచుకోవటానికి కూడా పనికిరావని అన్నారు. అయితే అచ్చెన్న వ్యాఖ్యలపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని నామినేటెడ్‌ పోస్టులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో బీసీలకు పదవులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తాము అవినీతి అక్రమాలు చేస్తే దానిని ఎన్నికలలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.