సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్

Friday, November 27th, 2020, 12:06:49 PM IST

ఎస్పీ చరణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మ్యూజిక్, డాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం వలన ఆయన కుమారుడు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు చరణ్. అయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ప్రభుత్వ సంగీత, నృత్య పాటశాల కి గనగందర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు చేరుస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.