ఆయన కోలుకుంటున్నారు అనేందుకు ఇదే నిదర్శనం – ఎస్పీ చరణ్

Thursday, August 27th, 2020, 01:14:04 AM IST

చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో కరోనా చికిత్స పొందుతున్న సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు అని కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. వైద్యులు ఎక్మో తో వైద్యం అందిస్తున్నారు అని చరణ్ అన్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. అయితే ఈ మేరకు ఒక వీడియో ద్వారా ఎస్పీ చరణ్ అభిమానులకు సందేశం పంపారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. అయితే నిన్నటికంటే ఎక్కువ సేపు మెలకువగా ఉన్నట్లు తెలిపారు. తనతో ఏదో చెప్పడానికి రాసేందుకు ప్రయత్నం చేశారు అని, కానీ పెన్ను కూడా పట్టుకొనే శక్తి లేకపోవడం తో రాయడం కుదరలేదు అని అన్నారు. అయితే త్వరలో రాయగలిగి తనతో మాట్లాడతారు అనే నమ్మకం తనకు ఉందని చరణ్ తెలిపారు. అయితే ప్రస్తుతం పాటలు వింటున్నారు అని, పాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఆయన కోలుకుంటున్నారు అనేందుకు ఇదే నిదర్శనం అని, ఇదే నేటి అప్డేట్ అని, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.