ఫ్లాష్ న్యూస్: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మరింత విషమం!

Thursday, September 24th, 2020, 07:30:34 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమం గా ఉంది అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. కరోనా వైరస్ తో బాధపడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 5 న ఎంజీఎం ఆసుపత్రి లో చేరారు. అయితే ఆసుపత్రి లో చేరినప్పటి నుండీ ఎక్మొ మరియు వెంటిలేటర్ తో సహా పలు మార్గాల ద్వారా వైద్య చికిత్స అందిస్తున్న విషయాన్ని తెలిపారు. అయితే గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమం గా ఉంది అని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ను నిరంతరం ఆసుపత్రి వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి అని తెలిపారు.

అయితే అనారోగ్యం తో ఆసుపత్రి లో చేరిన ఎస్పీ బాలు, కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ ను జయించారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు అని తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం పై ఎస్పీ చరణ్ సైతం సానుకూలం గా స్పందిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మళ్లీ విషమం గా మారడం తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.