ఎస్పీ బాలు చివరి కోరిక అదేనట!

Friday, September 25th, 2020, 06:14:44 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తో సినీ ప్రపంచం గొంతు మూగబోయింది. తన సంగీత ప్రయాణం లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో అవార్డులను అందుకున్నారు. దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వూ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన చివరి కోరిక ను వెల్లడించారు.

తన కెరీర్ లో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందిన బాలు, చనిపోయే వరకు పాడుతూనే ఉండాలి అని అనుకున్నారు. చావు తన దగ్గరికి వచ్చినట్లు తెలియకుండానే కన్ను మూయలి అని, అదే తన చివరి కోరిక అంటూ ఇంటర్వ్యూ లో తెలిపారు. అంతేకాక తన కుమారుడు కెరీర్ పై కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. చరణ్ కెరీర్ ను తనతో పోల్చడం ద్వారా ఎంతో నష్టం వాటిల్లింది అని తెలిపారు. పలు రంగాల్లో ప్రయత్నించి నష్ట పోయారు అని తెలిపారు.