వైరల్ అవుతున్న బాలు చివరి లేఖ.. కానీ ఇలా జరిగిపోయింది..!

Sunday, September 27th, 2020, 12:10:10 AM IST


గాంగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించిన ఎస్పీ బాలు 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే బాలు పాడిన పాటలకు పద్మశ్రీ, పద్మభూషణ్ నంది పురస్కారాలను అందుకున్నారు.

అయితే ఎంతో పేరు సంపాదించుకున్న బాలు బాలు ఎన్నడూ తన బిరుదులను బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలో పాల్గొన్నా తన పేరు ముందు ఎలాంటి విశ్లేషణలు చేయవద్దని ముందే స్పష్టం చేసేవారు. అయితే అలా బాలు చివరగా రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సన్మానితులు శ్రీ ప్రకాశ్ గారికి నమస్సులు, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను అని కొన్ని చిన్ని చిన్ని అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదని కోరారు. దయచేసి నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్, గాన గంధర్వ లాంటి విశ్లేషణలు వేయకండని అందులో రాశారు. మనకు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి, ప్రయాణ వివరాలు తరువాత తెలుపగలను అంటూ లేఖలో రాశారు. అయితే నవంబర్ 30న వస్తానని చెప్పిన బాలు ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది.