గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత..!

Friday, September 25th, 2020, 01:49:25 PM IST

సంగీత ప్రపంచంలో కోట్లాది హృదయాలను గెలుచుకున్న పాటల దిగ్గజం, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ రోజు మధ్యాహ్నాం 1:04 నిమిషాలకు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. గత 43 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలుకు చికిత్స అందిస్తున్నారు.

1946, జూన్ 4 న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో ఎస్పీ బాలు జన్మించాడు. బాల్యం నుంచే బాలుకు పాటలు పాడే అలవాటు ఉండేది. అయితే తండ్రి కోరిక మేరకు తొలుత ఇంజనీర్ కావాలని మద్రాసులో ఆంఈఏ కోర్సులో చేరాడు. అయితే అనూహ్యంగా గాయకుడిగా మారి తన స్వరంతో, పాటలతో గానగంధర్వుడుగా మారాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల లో కలిపి 40 వేలకు పైగా పాటలు పాడాడు. పలు టీవీ షోలతో కూడా ఎందరో వర్ధమాన గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఎస్పీ బాలు. ఈయన నటుడిగా కూడా పలు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.