కరోనా వేళ: ఆ దేశంలో రెండు మిలియన్ మంది విద్యార్థులు పాఠశాలకు!

Tuesday, May 26th, 2020, 03:05:56 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఒకటి, రెండు దేశాల్లో మాత్రమే ఉన్న వైరస్ కాదు. ప్రపంచ దేశాలను భయాందోళన లకు గురి చేస్తుంది ఈ కరోనా వైరస్. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆయా దేశాల ఆర్ధిక పరిస్థితులు దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ ను సడలిస్తూ పలు దేశాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపధ్యంలో కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా ఉన్న దేశం అయిన సౌత్ కొరియా లో లాక్ డౌన్ సడలింపు చర్యలు అమలు అవుతున్నాయి.

అయితే ఆ దేశంలో దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ఉన్నారు. అంతేకాక అన్ని రంగాలు తిరిగి పునః ప్రారంభం అయ్యేందుకు ఆ దేశం చర్యలు తీసుకుంటుంది. అయితే దశల వారిగా ఈ ప్రక్రియ ను అమలు చేస్తుంది. అక్కడి పాఠశాలలను పునః ప్రారంభం చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రెండవ దశలో దాదాపు 2 మిలియన్ మంది విద్యార్థులు మళ్లీ పాఠశాలలకు వెళ్లనున్నారు. బుధవారం నాడు మళ్లీ విద్యార్థులు పాఠశాలల కు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్ కు వాక్సిన్ రాకపోవడం తో స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు ప్రజలు.