విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దు – సోనూసూద్

Wednesday, August 26th, 2020, 12:30:57 PM IST

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం NEET,JEE పరీక్షలను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని, పరీక్షలు పేరుతో విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టవద్దని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ పరీక్షలపై స్పందించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ సైతం విద్యార్థుల వైపు నిలబడ్డాడు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని NEET,JEE పరీక్షలను భారత ప్రభుత్వం వాయిదా వేయాలని, విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దని అన్నారు. అయితే పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని కోరట్లేదని, రెండు మూడు నెలలు వాయిదా వేయాలని మాత్రమే విజ్ణప్తి చేస్తున్నామని తెలిపాడు.