బిగ్ వైరల్: సాయం చేసేందుకు తన ఆస్తులను తాకట్టు పెట్టిన సోనూసూద్..!

Thursday, December 10th, 2020, 01:00:27 AM IST

కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. పేదవాడికి ఆపద్బాందవుడులా, మంచితనానికి అంబాసిడర్‌గా మారిన సోనూసూద్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆపదలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు తన సోనూసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టారన్న ప్రచారం జరుగుతుంది. 10 కోట్ల రూపాయల విరాళం పోగు చేసేందుకు ముంబై జుహూలోని తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టారని, ఇందులో రెండు షాప్‌లు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సోనూ సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ కూడా జరిగిందని అంటున్నారు. నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ల కోసం కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా సోనూ తాకట్టు పెట్టాడంటే ఆయన ఎంత మంచి వాడో అర్ధమవుతుందంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.