సోనూ సూద్ మరొక సహాయం…చిన్నారి గుండె కి భరోసా!

Monday, November 2nd, 2020, 09:31:45 AM IST

Sonu-Sood

సినీ నటుడు సోనూ సూద్ ఈ లాక్ డౌన్ సమయం లో ఎంతోమందికి సహాయం చేసి తన మానవత్వ దృక్పథం ను చాటుకున్నారు. వీలైనంతవరకు ఇతరులకు సహాయం చేశారు సోనూ సూద్. అయితే గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ పేద కుటుంబానికి చెందిన ఒక చిన్నారికి సోనూ సూద్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో హఫీజ్ పేట లోని సరస్వతి కుమార్తె తేజశ్రీ కొన్నేళ్ళు గా గుండె జబ్బుతో బాధపడుతుంది. అయితే ఇప్పటికే ఆ కుటుంబం 20 లక్షల రూపాయల వరకు ఆ చిన్నారి ను కాపాడుకొనేందుకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితుల రీత్యా శస్త్ర చికిత్స కి ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది.

అయితే నగర శివారు ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం ఉన్నటువంటి సోనూ సూద్ వద్దకు ఈ కుటుంబం వచ్చి, తమ పరిస్తితి వివరించగా, సోనూ సూద్ వారికి హామీ ఇచ్చారు. చికిత్స కి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తా అంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోనూ సూద్ ఇచ్చిన హామీకి గానూ ఆ కుటుంబ సభ్యులు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరొకసారి సోనూ సూద్ చేసిన పనికి అభిమానులు రియల్ హీరో అంటూ చెప్పుకొస్తున్నారు.