షాక్ … సోనాక్షి ప్రేమాయణం లీకయిందోచ్ ?

Monday, November 7th, 2016, 08:55:32 AM IST


బాలీవుడ్ గ్లామర్ భామ సోనాక్షి సిన్హా ఎన్నో ఆశలు పెట్టుకున్న ”అఖీరా” చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పేరే తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా నీరుకారిపోయింది. ఇక బొద్దు అందాలు ఆరబోస్తూ .. హీటెక్కించే ఈమే కొన్ని రోజులుగా ఘాటు ప్రేమాయణం సాగిస్తోందంటూ బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి? ఈ విషయం పై ఈ అమ్మడు మాత్రం .. ఇవన్నీ ఒట్టి పుకార్లే ? అని కొట్టి పారేస్తూ వచ్చింది !! కానీ ప్రేమ రహస్యం ఎన్ని రోజులు దాచినా ఎదో ఒకరోజు బయటపడక తప్పదు కదా… అలాగే సోనాక్షి ప్రేమాయణం సాగిస్తున్న బంటి సజదే తో కలిసి ఓ నైట్ షాపింగ్ కి వెళ్ళింది … అంతే అక్కడ వీరిద్దరిని చుసిన వాళ్లకు అడ్డంగా దొరికి పోయింది. ఆ వెంటనే ..మీడియా ను చుసిన వీళ్ళు తప్పించుకుని వెళ్లిపోయారట !! వీరి వ్యవహారం పై పలురకాల వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మొత్తానికి సోనాక్షి కూడా ఘాటు ప్రేమలో ఉందనే విషయం.. లీక్ అవ్వడంతో ఈ భామ బయటికి కూడా రావడం లేదట !!