బీజేపీ, జనసేన కూటమికి చిరంజీవి మద్ధతు ఉంటుంది – సోము వీర్రాజు

Thursday, January 28th, 2021, 07:40:50 PM IST

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమికి మెగస్టార్ చిరంజీవి మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏపీలో బీజేపీ, జనసేన బలపడుతున్నాయని ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చి తీరుతామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారని, పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి మాటిచ్చారని నిన్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని, రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని పవన్‌కి చిరు సూచించినట్టు నాదెండ్ల చెప్పుకొచ్చారు. అయితే నిన్న నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు, నేడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే చిరంజీవి జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.