ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.. విజయసాయిపై మండిపడ్డ సోమువీర్రాజు..!

Tuesday, February 9th, 2021, 02:34:07 AM IST

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. దేశంలోనే రెండవ అత్యున్నతస్థాయి పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అయితే వెంటనే విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు.

అయితే ఏపీ సీఎం జగన్‌పై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. అయితే విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీనికి నిరసనగా వైసీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంకయ్య నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయని, బాధ్యాతయుతమైన చైర్మన్ పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు.