ఏపీ అభివృద్ది లో రాయలసీమది ప్రముఖ పాత్ర – సోము వీర్రాజు

Tuesday, October 6th, 2020, 02:10:35 AM IST


తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల పై మంగళవారం నాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల వివాదాల పై చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ను సోము వీర్రాజు కోరారు. అయితే ఈ వ్యవహారం పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ కి సోము వీర్రాజు లేఖ రాశారు. అయితే ఉమ్మడి రాష్ట్రములో తెలంగాణ ప్రాంతం వారే నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు అని సోము వీర్రాజు తెలిపారు.

అయితే ఉద్యమ సమయం లో కేసీఆర్ నీటి అంశాల పై అవగాహన పెంచుకున్నారు అని తెలిపారు. అయితే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ లో అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించారు అని, అందుకు అప్పటి సీఎం చంద్రబాబు మరియు ప్రతి పక్ష నేత జగన్ అభ్యంతరం తెలుపలేదు అని అన్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఏపీ సానుకూలం గా స్పందించాలి అని తెలిపారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది లో రాయలసీమ ది ప్రముఖ పాత్ర అని సోము వీర్రాజు అన్నారు.