సీఎం జగన్ కి సోము వీర్రాజు లేఖ…ఎందుకంటే?

Thursday, April 22nd, 2021, 03:00:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని సూచించారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థుల పరీక్షలకి ప్రజా రవాణా ద్వారానే రావాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నిర్ణయం వలన కరోనా వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.

అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాధి గ్రస్తుల చికిత్స మరియు చార్జి ల పై దృష్టి పెట్టాలి అంటూ సూచించారు. అయితే కొందరు లక్షలు ఖర్చు చేసిన ప్రాణాలు నిలుపుకోలేక పోతున్నారు అని, రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. అయితే కరోనా వైరస్ నియంత్రణకు అవసరం అయిన మందులు, ఆక్సీజన్ సరఫరా పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల పై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.