వైసీపీ, టీడీపీకి ఆ దమ్ముందా.. సోమువీర్రాజు సూటి ప్రశ్న..!

Thursday, February 4th, 2021, 03:47:27 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు, త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో బీజేపీ స్పీడు పెంచింది. తాజాగా రాష్ట్ర‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలు అంతా బీజేపీ పార్టీతోనే ఉన్నారని అన్నారు. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైసీపె, టీడీపీలకు ఆయన ఓ సవాల్ విసిరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనీ ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పామని టీడీపీ, వైసీపీ బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పే దమ్ము వైసీపీ, టీడీపీలకు లేదని, బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. అయితే తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయటమే బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.