మంత్రి కొడాలి నానిపై కేసు పెడతాం – బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

Monday, September 21st, 2020, 04:15:53 PM IST

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస ఘటనలు, తిరుమల డిక్లరేషన్ అంశానికి సంబంధించి నిన్న మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కొడాలి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు కొడాలి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

అయితే తిరుమలకు వచ్చే అన్యమతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఇందులో రెండో చర్చ లేదని అన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ కూడా సంతకం పెట్టారని గుర్తుచేశారు. హిందూ దేవుళ్ళపై దాడులు జరిగితే నష్టం ఏమిటంటూ మంత్రి కొడాలి నాని మాట్లాడడం సిగ్గుచేటు అని ఖచ్చితంగా ఆయన హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.