ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ అవినీతికి పాల్పడింది – సోము వీర్రాజు

Friday, August 28th, 2020, 03:15:11 PM IST

ap-bjp-chief-somu-veerraju

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయిన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ అంశాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డ్రిప్ ఇరిగేషన్, గృహ నిర్మాణం అంశాల్లో సీఎం చొరవ తీసుకోవడం లేదని అన్నారు.

అయితే ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అయినప్పటికి జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెతిన్నట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ఇక పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలలో కూడా వైసీపీ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ విచారణకు కోర్టు కూడా ఆదేశించిందని అన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది తమ డిమాండ్ అని, రాష్ట్ర రాజధాని అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.