జనసేనతో ఏపీలో ఎలా కొనసాగుతారో తెలిపిన సోము వీర్రాజు.!

Saturday, August 8th, 2020, 03:36:48 PM IST

ప్రస్తుతంలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీలతో పోలిస్తే సానుకూలమైన పరిస్థితులు జనసేన మరియు బీజేపీ పార్టీలకు ఉన్నాయని చెప్పాలి. ఎంతో సున్నితమైన రాజధాని అంశంలో పవన్ ముందుచూపు అంశం వారి పార్టీకు సామాన్యులలో మరింత పాజిటివిటినీ తెచ్చిపెట్టింది. అలాగే ఓటర రెండు పార్టీల స్టాండ్ ఏమిటి అన్నది తెలియడంతో కేవలం ఆ పార్టీ సపోర్టర్స్ ను మినహాయిస్తే మిగతా అంతా మూడు రాజధానుల అంశానికి వ్యతిరేఖంగానే ఉన్నారు.

అలాగే టీడీపీ కూడా అమరావతి విషయంలో చేసిన తప్పులను జనసేన మరియు బీజేపీలు ఇప్పుడు ఎత్తి చూపడంతో వారికి మరింత ప్లస్ అయ్యింది. అయితే ఇటీవలే ఏపీ బీజేపీ పార్టీకు కొత్తగా నియమితులు అయిన సోము వీర్రాజు దూకుడు కూడా గట్టిగానే ఉంది. దీనితో ఏపీలో వీరు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం అని తెలుస్తుంది.

అలాగే ఇటీవలే పవన్ ను కలిసిన ఆయన కొన్ని అంశాలను కూడా తెలిపారు. వాటితో పాటు తాము ఏం చెయ్యనున్నామో మరోమారు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలను ఇక్కడ పవన్ నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 లో నాటికి ఒక బలమైన శక్తిగా మారుతామని ఆయన తెలిపారు. మరి వీరి పొత్తు ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.