పవన్ తో భేటీ అయిన వీర్రాజు…అసలు ప్లాన్ ఇదేనా!?

Saturday, August 8th, 2020, 02:12:30 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ పార్టీలలో ఇపుడు జన సేన, బీజేపీ లు తమ పార్టీ లను బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అటు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని, ఇటు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అయితే ఇది వరకు ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ తో పోల్చితే సోము వీర్రాజు కాస్త దూకుడు గా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి.

రాజకీయాల్లో ఎంత వేగంగా పనులు జరిగితే అంత లాభం. ఇప్పటి వరకూ జన సేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నా, అంతగా ఒకరికి ఒకరు ప్రాముఖ్యత ఇవ్వలేదు అని చెప్పాలి. ఇటు నూతన అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ఇటు మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకి దగ్గర అవ్వడం మాత్రమే కాక ఒకే సారి టీడీపీ తీరు పై కూడా వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ దూకుడు దోరణి పై భవిష్యత్ లో జన సేన బీజేపీ కి లాభదాయకం గానే ఉంటుంది అని కొందరు చెబుతున్నారు. అయితే చిరు సైతం ఇరు పార్టీలు ప్రజా సమస్యల పై పోరాడాలి అని, 2024 వరకు అధికారం చేపట్టేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.