చంద్రబాబే పోలవరం కాంట్రాక్టర్ గా…సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Thursday, November 5th, 2020, 04:01:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయం లో గత ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబే పోలవరం కాంట్రాక్టర్ గా ఉన్నారని ఆనాడు ఒక కేంద్ర మంత్రి అన్నారు అని సోము వీర్రాజు తెలిపారు. గురువారం నాడు మీడియా సమావేశ లో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ను 48 వేల కోట్ల రూపాయల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు అని, చంద్రబాబు నాయుడు ఎవరినైనా మేనేజ్ చేయగలరు అని, లెఫ్ట్ కెనాల్ మరియు రైట్ కెనాల్ లలో భారీ అవినీతి చోటు చేసుకుంది అంటూ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక 5 కోట్ల రూపాయల వ్యయాన్ని గత టీడీపీ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలకు పెంచేసింది అని, యనమల వియ్యంకుడు కి ఈ పనులు అప్పజెప్పారు అని, అంచనాలు యాభై కోట్లు పెరిగిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసింది అని, దీంతో దేవిప ట్నం మునిగిపోయింది అని అన్నారు. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్మెంట్లు కట్టారు అని, పోలవరం డబ్బుతో పది కోట్ల రూపాయల భారీ గెస్ట్ హౌస్ ను విజయవాడలో 10 కోట్ల రూపాయల తో కట్టినట్లు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.