అమరావతికి బలవంతంగా రాజధానిని తరలించారు – సోము వీర్రాజు

Wednesday, November 25th, 2020, 08:50:59 AM IST

Somu_Veerraju

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాన్ రెసిడెన్షియల్ నేతగా వ్యవహరిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం తో అమరావతికి బలవంతంగా రాజధానిని తరలించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు అధికారం పోయిన తర్వాత రాష్ట్రాన్ని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉండటం విడ్డూరం గా ఉంది అని తెలిపారు. చంద్రబాబు నాయుడు చిన్న చిన్న మొత్తాలకు సంబంధించిన పనులు అప్పగిస్తే కమీషన్ రాదు అని, కేంద్రం నుండి ఆయన అధికారం లో ఉండగా పెద్ద మొత్తాలను తెచ్చుకొనే ప్రయత్నాలు చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తిరుపతి లో జన సేన పార్టీ తో కలిసి తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక తరహాలో తిరుపతి నియోజక వర్గం లో కూడా విజయం సాధించాలి అంటూ ఆ పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.