ప్యాకేజీ రూపంలో చంద్రబాబు అప్పట్లో స్వీకరించారు – సోము వీర్రాజు

Wednesday, December 23rd, 2020, 07:36:32 AM IST

తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక ఏపీ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్తితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యం అని భావించారు అని అన్నారు.మీడియా సమావేశం లో మాట్లాడిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా అంశం పై తెలుగు దేశం పార్టీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా పరంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు అన్నీ ప్యాకేజీ రూపంలో చంద్రబాబు అప్పట్లో స్వీకరించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు హయాంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో కొనుగోలు చేసిన థాంక్యూ సీఎం వాహనాల్లో పెద్ద మొత్తం లో అవినీతి జరిగింది అని సోము వీర్రాజు ఆరోపించారు. అయితే ఆ వాహనాలకి కేంద్రం డబ్బులు ఇస్తే చంద్రబాబు స్తిక్కర్ వేసుకొని కోట్ల రూపాయలు దండుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక పై సైతం సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా జన సేన తో చర్చలు జరుగుతున్నాయి అని, ఎవరో ఒక అభ్యర్ధి బరిలో ఉంటారు అని తెలిపారు.