బిగ్ న్యూస్: అమరావతి పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Monday, December 14th, 2020, 05:12:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం పై అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోనే ఉండాలి అని తెలిపారు. అయితే ఇందులో మరో ఆలోచన లేదు అని తేల్చి చెప్పారు. అయితే రాజధాని లో జరిగే అభివృద్ది అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయిస్తున్నదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా, కేంద్ర సంస్థలు అమరావతి లో ఉంటాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే అమరావతి లో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుంది అంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లు అన్నిటినీ రెండు వేల కోట్ల రూపాయల తో బీజేపీ అభివృద్ది చేస్తుంది అని వివరించారు. అయితే రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బీజేపీ ను గెలిపించాలని కోరారు. అంతేకాక ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరు లో డిఫెన్స్ అకాడెమీ నిర్మిస్తున్నాం అని తెలిపారు. అయితే అమరావతి ప్రాంతం పై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.