రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు మరొక డిమాండ్

Wednesday, August 19th, 2020, 02:06:34 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి జిల్లాలో పలు గ్రామాలు ముంపు కి గురి అవుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. బీజేపీ లోని కీలక నేతలతో ఈ పర్యటన లో పాల్గొన్నారు సోము వీర్రాజు. అయితే పోలవరం సమీపం లో ముంపుకి గురి అయిన పొలాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారి నష్టాన్ని అంచనా వేసేందుకు బాధితులతో మాట్లాడారు. అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

అయితే ఈ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అయిదు వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేల ఎకరాల పంటలు ముంపు కి గురి అయి నష్టం వాటిల్లడం తో సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. అయితే సీఎం జగన్ సైతం పలు చోట్ల ముంపుకు గురి అయిన ప్రాంతాలను పర్యటించారు. దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.