ఎన్నికల్లో ఏకగ్రీవం సహజం గా జరగాలి – సోము వీర్రాజు

Wednesday, February 3rd, 2021, 03:04:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నామినేషన్లు వేయడమే పెద్ద సమస్య గా మారింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉన్న తమ మద్దతుదారుల పై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కచ్చితంగా గెలుస్తామని అంటున్నారు, అలాంటప్పుడు ఈ పాట్లన్ని ఎందుకు అంటూ సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు బుధవారం నాడు మీడియా సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎన్నికల్లో ఏకగ్రీవం సహజం గా జరగాలి అంటూ చెప్పుకొచ్చారు. నామినేషన్లు వేయడమే ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద అంశం గా మారింది అని, నామినేషన్లు వేసే వారిని దాచేస్తున్నారు అని, ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం లో పది రకాలు అయిన కేసులు పెట్టడానికి ఓ చిట్టా తయారు చేసి అధికారులకు పంపిణీ చేశారు అంటూ ఆరోపించారు. అంతేకాక అన్యాయం గా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు అని, రౌడీ షీటలు తెరుస్తున్నారు అని, మద్యం తయారు చేసేది ప్రభుత్వం అని, విక్రయించేది కూడా ప్రభుత్వమే అంటూ చెప్పుకొచ్చారు. అక్రమ మద్యం పేరుతో కేసులు పెడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో అగ్రహ్ వ్యక్తం చేశారు.దమ్ముంటే నిజమైన ఎన్నికలు జరపండి అంటూ సోము వీర్రాజు అన్నారు.