నెలకు వాలంటీర్లకి రూ.310 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తుంది – సోము వీర్రాజు

Monday, March 22nd, 2021, 12:00:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణ కి ప్రతి బందకం గా మారుతోంది అంటూ సోము వీర్రాజు అన్నారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురి చేశారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.310 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పోలీస్, పంచాయతీ రాజ్, వాలంటీర్ వ్యవస్థ ల అరాచకల పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు అన్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఖర్చు చేస్తున్న వైఖరి పట్ల సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక కోసం కృషి చేస్తున్నాం అని, ప్రచారం పర్యవేక్షణ కోసం రెండంచల కమిటీ ను ఎర్పాటు చేసినట్లు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.