పంచాయతీ బోర్డు మెంబర్ కోసం 15 లక్షల ఖర్చు పెట్టే స్థాయికి వైసీపీ చేరింది – సోము వీర్రాజు

Friday, March 19th, 2021, 05:02:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల ముగిసిన పంచాయిత, మున్సిపల్ ఎన్నికల విషయం లో మొదటి నుండి ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పాలన చేస్తారని ప్రజలు అధికారమిస్తే, వైసీపీ పరిపాలనను గాలికి వదిలేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే లు, మంత్రులు ఎంత దోచుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టి అధికారాన్ని వ్యాపారం గా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పంచాయతీ బోర్డు మెంబర్ కోసం 15 లక్షల రూపాయల ఖర్చు పెట్టే స్థాయికి వైసీపీ చేరింది అంటూ సోము వీర్రాజు ఆరోపించారు. అయితే ఇదే ప్రజాస్వామ్యం అని అనుకుంటే వైసీపీ ను కూకటి వేళ్లతో పెకిలిస్తారు అంటూ చెప్పుకొచ్చారు.