టీడీపీ ఎంపీ కి ధీటుగా సమాధానం ఇచ్చిన చంద్రబాబు – సోము వీర్రాజు

Wednesday, March 31st, 2021, 07:39:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్ లో మరొకసారి చర్చంశనీయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు దేశం పార్టీ ఎంపీ అయిన శ్రీ రామ్ మోహన్ నాయుడు ప్రత్యేక హోదా కావాలంటూ మరొకసారి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు గతం లో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ కి మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక విషయం లో తెలుగు దేశం పార్టీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కదు అంటూ ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక బరిలో ఉన్న అభ్యర్ధి సైతం ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని తేల్చి చెప్పేశారు. అయితే కొందరు మాత్రం గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజి కి మొగ్గు చూపడం కారణం గా హోదా దక్కలేదు అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ కి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు, మంత్రులు సైతం టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.