కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్య పెడుతున్నాయి

Monday, December 28th, 2020, 07:34:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతి పక్ష పార్టీ ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్య పెడుతున్నాయి అని ఘాటు విమర్శలు చేశారు. రైతు సాధికార సదస్సులో మాట్లాడిన సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త చట్టాల విషయంలో రైతులు ఐదు అంశాల పై ఉద్యమిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాక పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అయితే వ్యవసాయ మార్కెట్లు మూత పడతాయి అనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే అంటూ తేల్చి చెప్పారు. అంతేకాక రైతుల భూములను ఎటువంటి ఇబ్బందీ ఉండదు అని సోము వీర్రాజు అన్నారు. అయితే రైతులకు నిర్దేశించిన ధరను గడువులోగా చెల్లించని పక్షం లో జరిమానా విధిస్తారు అని వివరించారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ ఒప్పంద వ్యవసాయ విధానం అమలు లో ఉందని సోము వీర్రాజు ఈ మేరకు తెలిపారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ కాగా, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.