చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజి తీసుకున్నారు – సాము వీర్రాజు

Thursday, March 25th, 2021, 07:32:45 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోదా కన్నా ప్యాకేజి యే ముద్దు అని చంద్రబాబు అన్నారు అంటూ సోము వీర్రాజు అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా, కేంద్ర ప్రభుత్వం తో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజి తీసుకున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు అధికారం పోయాక వారి ఎంపీ లు హోదా గురించి మాట్లాడటం విడ్డూరం గా ఉందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అయితే అధికార పార్టీ వైసీపీ పై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్నో అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి ఉపఎన్నికలో ఇప్పటికే రెండు లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్ కార్డులు తయారు చేసినట్టు సమాచారం వచ్చింది అని సోము వీర్రాజు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు గుర్తించాం అని అన్నారు. అయితే దీని పై కేంద్ర ఎన్నికల సంఘం కి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రజలు బీజేపీ ను గెలిపించక పోయినా, బీజేపీ ఏనాడూ రాష్ట్రం పై చిన్న చూపు చూడలేదు అని వ్యాఖ్యానించారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.