స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ను ఎదుర్కోలేక టీడీపీ తోకముడిచింది – సోము వీర్రాజు

Thursday, March 18th, 2021, 07:27:20 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ లకు అవసరమైన ఉద్యోగాలను నాలుగైదు లక్షల చొప్పున చంద్రబాబు అమ్ముకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని 2014 లో చంద్రబాబు కి ప్రజలు పట్టంకడితే ఆయనేమో రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేశారు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ను ఎదుర్కోలేక టీడీపీ తోక ముడిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన అందిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతి భూ భూకుంభకోణం విషయం లో చంద్రబాబు కి సీఐడీ నోటీసులు కూడా అందజేసింది. అయితే తాజా పరిణామాల పట్ల అటు వైసీపీ తో పాటుగా బీజేపీ సైతం టీడీపీ పై విమర్శలు చేస్తోంది. మరోపక్క జన సేన కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కి సీఐడీ నోటీసులు ఇవ్వడం పట్ల సానుకూలం గా స్పందించిన సంగతి తెలిసిందే.