మాట తప్పిన చంద్రబాబు ను మీడియా ఎందుకు ప్రశ్నించదు – సోము వీర్రాజు

Tuesday, September 8th, 2020, 04:30:01 PM IST

Somu_Veerraju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరొకసారి తెలుగు దేశం పార్టీ పై, చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. కృష్ణా పుష్కరాల్లో పలు ఆలయాలను టీడీపీ నేలమట్టం చేసింది అని, ఆనాడు టీడీపీ కి హిందుత్వం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. దాడుల పై జరిగే హక్కు టీడీపీ కి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కృష్ణా పుష్కరాల్లో 17 దేవాలయాలను నేలమట్టం చేసినపుడు, ఆ సమయం లో విజయవాడ లో గో శాల ను సందర్శించి నప్పుడు బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని సూటిగా ప్రశ్నించారు.

అయితే చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నపుడు ఒక్క ఆలయం అయినా కట్టించారా అని అడిగారు. ఆరోజు మాట్లాడని వారు నేడు అంతర్వేది ఘటన పై ఎలా మాట్లాడుతారు అని దిమ్మ తిరిగే ప్రశ్న విసిరారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణం పై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. దేశం లో ఎక్కడ రాజధాని నిర్మాణం జరిగినా, అమరావతి కి వచ్చిన హైప్ ఎక్కడా రాలేదు అని అన్నారు. చంద్రబాబు గత అయిదేళ్ళు హైప్ క్రియేట్ చేసారు. అయితే అలా అమరావతిని నిర్మించలేని చంద్రబాబు ను అందరూ ప్రశ్నించాలి అని అన్నారు. అంతేకాక రాజధాని నిర్మాణ కోసం 7,200 కోట్ల రూపాయల డబ్బు ను ఏం చేశావని నిలదీయాలి అంటూనే, మీడియా చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించాలి అని అన్నారు.