ఈ రాష్ట్ర ప్రభుత్వ అవకాశ వాద రాజకీయాలకు ఇది నిదర్శనం – సోము వీర్రాజు

Friday, August 14th, 2020, 04:31:13 PM IST

ap-bjp-chief-somu-veerraju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పలు పరిణామాల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన శైలిలో స్పందిస్తున్నారు.అయితే ప్రజా స్వామ్యం లో చట్టం ముందు ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని అవహేళన చేస్తూ ఒకప్పుడు గుంటూరు లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిందితుల పై పెట్టబడిన కేసులను ఎత్తివేస్తూ సంఘ విద్రోహ శక్తులకి మరిన్ని అవకాశాలను కల్పించడం ఈ రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని సోము వీర్రాజు అన్నారు.

అయితే ఇది పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తుంది అని, ఇది చాలా దురదృష్టకరం అని, ఇటువంటి నిర్ణయాలు బెంగుళూరు నగరం లో జరిగిన దాడుల వంటి దురదృష్టకర సంఘటనలు మన రాష్ట్రం లో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి అని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తు లో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్తేర్ధ్యాన్ని దెబ్బతీస్తుందనటం లో ఏమాత్రం సందేహం అవసరం లేదు అంటూ హెచ్చరిక లు జారీ చేసారు.