ప్రజాస్వామ్య విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు – సోము వీర్రాజు

Sunday, February 14th, 2021, 10:58:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో అధికార పార్టీ తీరు పట్ల అటు తెలుగు దేశం పార్టీ, ఇటు బీజేపీ, జన సేన లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లో పంచాయతీ ఎన్నికలు ఏక పక్షంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయి అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే అధికారుల పై, రాష్ట్ర ప్రభుత్వం పై సోము వీర్రాజు విరుచుకు పడ్డారు. ప్రజాస్వామ్యం పై రాష్ట్ర ప్రభుత్వం కి ఎలాంటి మమకారం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే సంక్షేమ పథకాల పై నమ్మకమే ఉంటే ఎందుకీ ఏక గ్రీవాలు అంటూ సూటీగా ప్రశ్నించారు. అయితే ఎన్నికలు సరైన పద్దతి లో జరిగితే ఓటమి తప్పదు అనే భయం వైసీపీ లో కనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఎన్నికల్లో పోలీస్, రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అంటూ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. అయితే అభ్యర్థులకు ధృవ పత్రాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టారు అంటూ ఆరోపించారు. అయితే రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్తే బెదిరింపులు, కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. అయితే ప్రభుత్వం ఐదేళ్ళ వరకూ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం అంశాలన్నింటినీ కేంద్ర వద్దకు తీసుకు వెళ్తా అంటూ చెప్పుకొచ్చారు.