నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలి

Wednesday, January 27th, 2021, 12:40:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశం పై ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అయితే ఈ మేరకు బీజేపీ మరియు జన సేన పార్టీ కి చెందిన కీలక నేతలు మీడియా సమావేశం ద్వారా పలు వ్యాఖ్యలు చేశారు. జన సేన పార్టీ అన్నీ చోట్ల పోటీ చేయనుంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే ఏకగ్రీవ విషయాల్లో గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా మరింత అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే ఏకగ్రీవాల విషయం లో అధికార పార్టీ కి చెందిన నేతలు మాట్లాడిన మాటల పై జనసేన మరియు బీజేపీ నేతలు గవర్నర్ ను కలుస్తామని ప్రకటించారు. అయితే వైసీపీ నాయకుల మాటలు ఏకగ్రీవాలను ప్రోత్సహించడం జరుగుతుంది అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

అయితే కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాల పై పత్రికల్లో ప్రకటనలు వేయడంఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉండాలి అని, ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరగాలి అంటూ నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే గతంలో జరిగిన హింసాత్మక ప్రక్రియను ప్రభుత్వం నిలుపుదల చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, అభ్యర్దులు నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలి అంటూ సోము వీర్రాజు అన్నారు. అయితే జన సేన, బీజేపీ కి చెందిన నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.