రామతీర్థం వెళ్ళడానికి బీజేపీ ను అనుమతించాలి – సోము వీర్రాజు

Wednesday, January 6th, 2021, 03:48:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే వరుసగా ఆలయాల విగ్రహాల పై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రామతీర్థం ఆలయం లోని శ్రీ రాముని విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఇప్పటికే టీడీపీ మరియు వైసీపీ శ్రేణులు ఆలయాన్ని సందర్శించారు. ఘటన స్థలిని పరిశీలించారు. అయితే బీజేపీ మరియు జన సేన లి తలపెట్టిన ధర్మ యాత్ర ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే ధర్మ యాత్ర ను అడ్డుకోవడం పట్ల బీజేపీ మరియు జన సేన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల పై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం పై వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. అయితే రామతీర్థం వెళ్ళడానికి బీజేపీ ను అనుమతించాలి అనేది తమ ప్రధాన డిమాండ్ అంటూ సోము వీర్రాజు అన్నారు. అయితే ఏపీ లో జరుగుతున్న దాడులకు నిరసన గా బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.