పోలవరం ప్రాజెక్ట్ పై ఆయనకు ఎటువంటి అవగాహన లేదు

Monday, November 16th, 2020, 02:25:39 PM IST

Somu_Veerraju

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయం లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు భాషకి అనుగుణంగా రాతలు రాయాలనే తప్ప, పోలవరం ప్రాజెక్టు పై రాధాకృష్ణ కి ఎటువంటి అవగాహన లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే భద్రాచలం తో సహా పది మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తాయని అన్నారు, ముంపు మండలాలను కేసీఆర్ అడగారా అంటూ సూటిగా ప్రశ్నించారు.రాధాకృష్ణ పిచ్చి రాతలు రాస్తున్నారు అని, పోలవరం ఎత్తుల పై కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దమ్ము ధైర్యం ఉంటే పోలవరం పై చంద్రబాబు నాయుడు చర్చకు సిద్దంగా ఉండాలి అని సోము వీర్రాజు అన్నారు. అయితే మరోమారు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.