భవిష్యత్ లో వారితో పొత్తు పెట్టుకొం – సోము వీర్రాజు

Sunday, December 20th, 2020, 09:24:16 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన సత్తాను చాటేందుకు అన్ని విధాలుగా సిద్దం అవుతోంది. అయితే భవిష్యత్ లో మాత్రం వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీ లతో బీజేపీ పొత్తు పెట్టుకోదు అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. 50 ఏళ్లుగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉంది అని సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల పై అధికార మరియు ప్రతి పక్ష పార్టీ లు శ్వేత పత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ను ఎలా అయితే ఒత్తిడి చేస్తుందో అదే విధంగా రాయలసీమ ప్రాజెక్టుల విషయం లో ప్రణాళిక విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాయలసీమ ప్రాంతం ఇంకా అభివృద్ది చెందడం లేదు అంటూ సోము వీర్రాజు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పది వేల కోట్ల రూపాయల నిధులతో రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బంగారం దొరుకుతుంది కానీ, ఇసుక మాత్రం దొరకడం లేదు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే గత ప్రభుత్వం హయం లో ఇసుక చౌక గా లభించింది అని, ప్రస్తుతం ఆ పరిస్థతి లేదు అంటూ వ్యాఖ్యానించారు.