గంటాని రావద్దనడం విడ్డూరంగా ఉందట..!

Saturday, August 8th, 2020, 07:05:20 AM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కీలక రాజకీయ నాయకుడు అయిన గంటా శ్రీనివాసరావు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి కొనసాగుతున్న గంటా ఎప్పటిలానే మరో పార్టీలోకి జంప్ అవ్వనున్నారని వార్తలు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలు.

కానీ ఈసారి మాత్రం గంటా వైసీపీ లో చేరడం ఖరారు అన్నట్టే తెలుస్తుంది. దీనితో వైసీపీ శ్రేణుల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలతో ఇతర పార్టీల అభిమానులు నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అవంతి శ్రీనివాస్ గంటాపై కామెంట్స్ చెయ్యడం మరింత విడ్డూరంగా ఉంది.

అసలు అవంతియే టీడీపీ నుంచి వైసీపీకు వచ్చి చేరిన నేత పైగా అతను ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి చోటు లేదని అనడం ఆశ్చర్యకరం. ఇక ఇదే అనుకుంటే మరోపక్క ఎన్నో కేసులు ఉన్న గంటాను వైసీపీలో చేర్చుకోకూడదని మరికొందరి డిమాండ్ చూసి కొంత ఫక్కున నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.