పవన్ జగన్ ను అభినందించినా తిట్టినట్టే ఉందట..!

Saturday, July 4th, 2020, 07:06:58 AM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రధానమైన విమర్శలు ప్రతివిమర్శలు అనేవి మూడు ముఖ్య పార్టీల నడుమనే నడుస్తున్నాయి. మొదటి రెండు పార్టీలు వైసీపీ మరియు టీడీపీ అయితే ఆ మిగిలిన మూడో పార్టీనే జనసేన. మూడో ప్రత్నామ్యయం గా వచ్చిన ఈ పార్టీ ఊహించని విధమైన ఫలితాన్ని అందుకుంది.

దీనితో ఈ పార్టీపై ఇప్పటికీ గట్టిగానే ఎన్కౌంటర్లు పడుతునే ఉన్నాయి. అలా అని వీరు చేసే విమర్శలను మిగతా రెండు పార్టీల వారు ఏమన్నా లైట్ తీసుకుంటారా అంటే అదీ ఉండదు. దీనితో ఎన్నికల్లో మాత్రమే కాకుండా ఏపీ రాజకీయ వర్గాలలో కూడా త్రిముఖ విమర్శలు వినిపిస్తున్నాయి. అలా అధికార పార్టీ వైసీపీ పై పవన్ ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

అలాగే కొన్ని హర్షణీయ పరిణామాలకు అభినందనలు తెలిపిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలా తాజాగా జగన్ కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కానీ ఇటీవలే అత్యవసర అంబులెన్స్ సర్వీసులను భారీ స్థాయిలో మొదలు పెట్టడం వంటి వాటిని అభినందిస్తూ జగన్ కు అభినందనలు తెలిపారు. అయితే ఈ మూవ్ పవన్ నుంచి ఊహించనిది కావడంతో కొందరు జగన్ ఫ్యాన్స్ హర్షించారు.

మరికొందరు అందులో కూడా పవన్ తప్పిదాన్ని నిలదీశారు. పవన్ అభినందిస్తే అభినందించాలి కానీ మళ్లీ ఇక్కడ కూడా “జగన్ రెడ్డి” అంటూ ఎందుకు ప్రస్తావించాలి అని మండిపడుతున్నారు. దీనితో పవన్ అభినందనలు కూడా తిట్లలానే కొందరికి అనిపించాయని చెప్పాలి.