సోలో బ్రతుకే సో బెటర్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్..!

Friday, December 25th, 2020, 10:20:12 AM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్‌ జంటగా, నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం ఇదే కావడంతో అన్ని ధియేటర్లు జనాలతో కలకలలాడాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రిఫోర్ట్‌తోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు సినిమా చాలా నీట్‌గా సాగింది. ఆహ్లాదకరమైన, చక్కని పాటలు మరియు సింపుల్ ట్విస్టులతో, డీసెంట్ కామెడీ జోనర్‌తో సినిమా చాలా సజావుగా సాగింది. ఈ ఫన్ ఎంటర్టైనర్‌లో సాయి ధరమ్ తేజ్ చాలా చక్కగా యాక్ట్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నభా నటేశ్ ఎంట్రీ కూడా బాగుంది. మొత్తానికి సినిమాలో సెకాండ్ హాఫ్ కీలకం కానుంది.