సోలిపేట రామలింగారెడ్డి లాగే ప్రజలకు అందుబాటులో ఉంటా – సుజాత

Tuesday, October 27th, 2020, 12:39:36 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం లో బాగంగా సోలిపేట సుజాత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నిక లో తనను ఆదరించండి అంటూ ప్రజలను అభ్యర్థించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి లాగే దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అని సోలిపేట సుజాత హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రచారం లో పాల్గొన్న పలు కీలక నేతలు సైతం తెరాస ప్రభుత్వ తీరు పై ప్రశంసల వర్షం కురిపించడం మాత్రమే కాకుండా, మంత్రి హరీశ్ రావు మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారం తో నియోజక వర్గాన్ని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లు మరోమారు అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. తెరాస తీరును విమర్శించడం మాత్రమే కాకుండా, తెరాస ఇచ్చిన హామీలు నేరవేర్చాలంటే తమని గెలిపించాలని కోరుతున్నారు ప్రతి పక్ష పార్టీ నేతలు. ఈ నేపధ్యంలో హుజూర్ నగర్ తరహాలో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.