యూత్ వినూత్న ఆలోచన…అర ఎకరం పొలం లో అద్భుత వినాయకుడు!

Saturday, August 22nd, 2020, 12:11:42 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వినాయక చవితి పండుగ సైతం బహిరంగం గా జరుపుకొనే వీలు లేకుండా పోయింది. ఈ ఏడాది భారీ విగ్రహ ప్రతిమ లు సైతం కనుమరుగు అయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే మట్టి వినాయకుల ను, ప్రకృతి లో కలిసిపోయే విధంగా తయారు చేస్తున్నారు. అయితే అదే కోవలో వినూత్నంగా సొలాపూర్ లోని బాలే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఒక వినాయకుడి ను ఏర్పాటు చేశారు.

అర ఎకరం పొలం లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు ఒక నెల కష్టపడ్డారు ఆ యువకులు. అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ యువత యొక్క టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు. ఆ పర్యావరణ వినాయకుణ్ణి మీరు చూసేయండి.