2025 కల నెరవేరుతుందా..!

Monday, January 19th, 2015, 01:12:17 PM IST


2025 నాటికి ఆకలి లేని సమాజం ఏర్పాటు కావాలని ఐక్యరాజ్య సమితి కల అని దాన్ని నెరవేర్చే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేయాలని భారత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామీనాథన్ అన్నారు. గుంటూరులో అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం అయింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్ తో పాటు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇంకా పలువురు శాస్త్రవేత్తలు మరియు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్వామినాథన్ మాట్లాడారు. పప్పు దాన్యాలు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. 2016వ సంవత్సరాన్ని పప్పుదాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక, 2025 నాటికి ఆకలి లేని సమాజం ఏర్పాటు కావాలని ఐక్యరాజ్య సమితి కోరుకుంటున్నదని… ఐక్యరాజ్య సమితి కల నేరవేరెందుకు అందరు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.