షాక్‌ : బుల్లి ఖాన్‌ని ఎప్పుడైనా ఇలా చూశారా?!

Wednesday, November 15th, 2017, 04:23:45 PM IST

బుల్లి షారూక్‌ఖాన్‌ని ఎప్పుడైనా ఇలా చూశారా? చూస్తే షాక్ తింటారు. నిజంగానే ఖాన్ వార‌సుడు పెద్దోడిగా ఎదిగేసి, ఇంత ర‌చ్చ చేస్తాడ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. స‌రోగ‌సి ద్వారా షారూక్ న‌ట్టింట అడుగుపెట్టిన ఎబి రామ్ అప్పుడే జ‌రంత స్పీడ్గానే ఎదిగేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఎంత‌గా అంటే… తండ్రి షారూక్‌తోనే పోటీప‌డుతూ డ్యాన్సులాడేంత‌. నిన్న‌టిరోజున చిల్డ్ర‌న్స్ డే స్పెష‌ల్‌గా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన షారూక్ ఏబి రామ్‌తో ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేశాడు. ఆ క్ర‌మంలోనే త‌న‌యుడితో క‌లిసి డ్యాన్సులు చేశాడు. ఎబి రామ్ చూసేందుకు అచ్చం షారూక్‌నే త‌ల‌పిస్తున్నాడు. ఆ హెయిర్ స్టైల్‌, తీర్చిదిద్దిన కోటేరు లాంటి ముక్కు.. చిలిపి న‌వ్వు ప్ర‌తిదీ షారూక్‌నే గుర్తు చేస్తున్నాడు. షారూక్‌ వార‌సుడిగా ఎబి రామ్ మాత్రం చాలా అదృష్ట‌వంతుడు. అక్క సుహానా, అన్న ఆర్య‌న్‌తో క‌లిసి ఆడుకునేంత వెసులు బాటు ఉంది.

ఇక త‌న‌యుడితో పాటు స్పార్క్ స్వ‌చ్ఛంద సంస్థ‌కు చెందిన 100 మంది అనాధ‌ల స‌మ‌క్షంలో బాల‌ల దినోత్స‌వాన్ని గ‌డిపాడు షారూక్‌. బాద్ షా ఉంటున్న సెట్స్‌కి వంద మంది అనాధ‌ల్ని ఆహ్వానించాడు. అక్క‌డ వారితో క‌లిసి గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించాడు. పిల్ల‌ల‌తో క‌లిసి ఆటాపాటతో సంద‌డి చేశాడు. నా బాల్యం గుర్తొస్తోందంటూ ఈ సంద‌ర్భంగా కామెంట్ చేశాడు. వాస్త‌వానికి ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా అసాధార‌ణ హీరోగా ఎదిగిన కింగ్ ఖాన్ ఒక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌లో అనాధ‌గానే ప్ర‌వేశించాడు. నాడు త‌న‌కి ఏం అండ‌దండ‌లు లేవ్‌. అవ‌మానాలే ఉండేవి. వాట‌న్నిటిని ఆ క్ష‌ణం షారూక్ గుర్తు చేసుకున్నాడ‌ని త‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు త‌న‌కి అన్నీ ఉన్నాయ్‌. ప్ర‌పంచ‌మే త‌న వెంట ప‌డుతోంది. కాలం తెచ్చిన మార్పు ఇది. ప్ర‌తి ఒక్క‌రికి ఇలాంటి అనుభ‌వాలు త‌ప్ప‌నిస‌రి.