కేసీఆర్ అన్న నువ్వు పీఎం అవుతావు.. చిన్నారి వీడియో వైరల్..!

Saturday, March 27th, 2021, 08:24:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ చిన్నారి ప్రశంసల వర్షం కురిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరగుతుండడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం విద్యాసంస్థలన్నిటిని ఇప్పటికే మూసివేసింది. అయితే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు మాత్రం విద్యాసంస్థలను తెరవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా, తల్లిదండ్రుల విజ్ణప్తి మేరకే విద్యాసంస్థలను మూసివేసినట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా సీఎం కేసీఆర్ నిర్ణయంపై మాత్రం ఓ చిన్నారి ప్రశంసలు కురిపించింది. కేసీఆర్ అన్న మీకు చిన్న పిల్లల ఆశీర్వాదం ఉందని, చిన్న పిల్లల ఆశీర్వాదంతో మీరు ముఖ్యమంత్రి నుంచి ప్రధాని మంత్రి అవుతారని చెప్పింది. స్కూళ్లను ఓపెన్ చేయకండి.. మూసివేయండి’ అంటూ ఓ చిన్నారి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.