రోడ్డు ఎప్పుడు వేయిస్తారు.. ఎమ్మెల్యేనే ప్రశ్నించిన బాలుడు..!

Saturday, December 19th, 2020, 02:08:57 AM IST

ప్రజాప్రతినిధులతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ ప్రాంత సమస్యల గురుంచి ప్రశ్నించారా? హా మాకు అంత ధైర్యమెక్కడిది అని అంటారా.. అంతేలెండి నోట్ల కట్టలకి, మద్యం సీసాలకి ఓటును అమ్ముకుంటున్న ఈ తరుణంలో ఇక ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడ ఉంటుందిలే. ఇది కాసేపు పక్కన పెడితే ఓటు హక్కు కూడా లేని ఓ బుడ్డోడు ఏకంగా ఎమ్మెల్యేనే ప్రశ్నించాడు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రవి శంకర్‌ను ఆపి మరీ ఓ బాలుడు తమ కాలనీకి రోడ్డు సమస్య పరిష్కారం ఎప్పుడు చేస్తారు, రోడ్డు ఎప్పుడు వేయిస్తారు అని ప్రశ్నించారు. పెద్దల నుంచి రాని ప్రశ్న బాలుడి నోట వెంట వచ్చే సరికి ఎమ్మెల్యే రవి శంకర్ కూడా ముచ్చటపడ్డారు. వెంటనే బాలుడిని దగ్గరకు తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తప్పకుండా రోడ్డు వేయిస్తానని ఆ బాలుడికి ఎమ్మెల్యే హామీ ఇస్తాడు.