ముచ్చటగా మూడోసారి ఆ జిల్లా వాసినే వరించిన యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి..!

Saturday, January 9th, 2021, 09:22:10 AM IST

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసికి దక్కింది. గతంలో పాలమూరు జిల్లా నుంచి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహించగా తాజాగా వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డి ఈ పదవికి ఎంపికైనట్టు భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) ప్రకటించింది.

అయితే ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లో కొత్తకాపు శివసేనారెడ్డి 59,997 ఓట్లు సాధించారు. 52,203 ఓట్లు సాధించిన ఎం. రాజీవ్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 21,862 ఓట్లు సాధించి ఎస్టీ కోటాలో మరో ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు పోరిక సాయిశంకర్ ఎన్నికయ్యారు. మహిళల కోటాలో నేనావత్ ప్రవల్లిక ఉపాధ్యక్షురాలిగా గెలుపొందింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ను నిన్న ఢిల్లీలో శివసేనారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.